Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు సీఎంతో ఆమంచి భేటీ అవుతారా ? రంగంలోకి వైసీపీ నేతలు

Category : politics state

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరబోతున్నారా? లేక అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయ్యి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారా? ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆమంచి ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? అన్నది ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ కొంతకాలంగా టీడీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2014 లో చీరాల నుంచి పోటీ చేసిన పోతుల సునీత వర్గానికి రెండు పదవులు ఇవ్వడం, అలాగే పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతోందనే కారణాలతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు పార్టీ మారాలని సూచన చేశారు. దాంతో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరావు లు ఆమంచిని వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఆమంచి కూడా దాదాపు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం ఆమంచిని బుజ్జగించేందుకు అధిష్టానం దూతగా మంత్రి శిద్దా రాఘవరావును రంగంలోకి దింపింది.. ఒకసారి సీఎంతో మాట్లాడాలని శిద్దా ఆమంచిని కోరడంతో..

గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. అయితే సీఎం సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. బుధవారమే సీఎంను కలవాల్సిన ఆమంచి.. సాయంత్రం త్రిమూర్తులు స్వగ్రామమైన వెంకటాయపాలెం వెళ్లి ఆయనతో చర్చించారు. దీంతో ఆమంచి చంద్రబాబు ను కలుస్తారా లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడు అయిన ఆమంచిని వైసీపీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో బొత్స సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వర రావు రంగంలోకి దిగి ఆమంచి మనసు వైసీపీ వైపు మళ్లించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు.

Related News