ప్రపంచకప్ క్రికెట్లో ఆరుసార్లు డిఫెండింగ్ ఛాంప్ ఆస్ట్రేలియాకు మిథాలీ సేన ముచ్చెమటలు పట్టించింది. 23న ఇంగ్లాండ్‌తో జరిగే టైటిల్ పోరుకు అర్హత సాధించే కీలకమైన రెండో సెమీస్‌లో కలిసొచ్చిన డెర్బీ మైదానంలో టాస్ గెలిచిన భారత్ భారీ స్కోర్ 281/4తో పట్టు బిగించింది.
ఓపెనర్లు విఫలమైనా కీలకమైన ఇన్నింగ్స్ ఆడే బాధ్యత భారత వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకుంది. ఆకాశమే హద్దుగా ఇరవై బౌండరీలు, ఏడు సిక్సర్లతో కదం తొక్కిన కౌర్ 171 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఆసీస్ ముందు టీమిండియా 282 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ఆస్ట్రేలియాతో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 42 ఓవర్లలో 281 భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చివరి వికెట్‌కు ఆస్ట్రేలియా జట్టు 76 పరుగులు జోడించి భారత్‌కు ముచ్చెమటలు పట్టించింది. సూపర్ సెంచరీతో అలరించిన భారత స్టార్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 23న టైటిల్ పోరుకై ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అజేయమైన 171 పరుగులతో ఆసీస్ ముందు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. 282 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు రెండో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగలింది. మూనీని పాండే క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ 4 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
ఐదో ఓవర్ వేసిస గోస్వామి లానింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఖాతా తెరవకుండానే పెవిలియన్ ముఖం పట్టించింది. ఎనిమిదో ఓవర్లో బోల్డన్ను 14 పరుగుల వద్ద దీప్తి శర్మ కాటన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ 21 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాలో కూరుకుపోయింది. తర్వాత ఆసీస్ 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.