మహిళా ప్రపంచకప్ టోర్నీకోసం సెలెక్టర్ మిథాలీరాజ్ సారథ్యంలోని జట్టును ఎంపిక చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో నాలుగు దేశాల క్రికెట్ టోర్నీలో ఆడుతున్న భారత జట్టునే ప్రపంచకప్ కు కొనసాగిస్తున్నారు. మహిళా వరల్డ్‌కప్ జూన్ 24న ఇంగ్లండ్‌లో ప్రారంభంకానుంది.
జట్టు : మిథాలీరాజ్ (కెప్టెన), హర్మనప్రీత కౌర్, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, పూనమ్ రౌత, దీప్తి శర్మ, జులన గోస్వామి, షిఖా పాండే, ఏక్తా బిస్త్, సుష్మ వర్మ, మన్సీ జోషీ, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, నుజత పర్వీన, స్మృతి మందన