//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మిస్ట‌ర్ ఇండియా 2017 ఎవరో తెలుసా ?

Category : national

ముంబైలో బాంద్రా ఫోర్ట్ మిస్ట‌ర్ ఇండియా 2017 పోటీలు జ‌రిగాయి.

పీట‌ర్ ఇంగ్లండ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ పోటీల్లో మిస్ట‌ర్ ఇండియా 2017గా ల‌క్నోకి చెందిన జితేశ్ సింగ్ దేవ్ నిలిచారు. దీంతో మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ 2020 పోటీల్లో జితేశ్ సింగ్ దేవ్ పాల్గొనే అవ‌కాశం క‌లిగింది. అలాగే మిస్ట‌ర్ ఇండియా సూప్ర‌నేష‌న‌ల్‌గా ప్ర‌త‌మేశ్ మౌలింక‌ర్ నిలిచారు. ముంబైలోని బాంద్రా ఫోర్ట్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన మిస్టర్ ఇండియా 2017 పోటీల్లో 17 మంది పాల్గొన్నారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సూప్ర‌నేష‌న‌ల్ 2018 పోటీల్లో ప్ర‌త‌మేశ్ పాల్గొన‌నున్నారు. ఈ పోటీల్లో అభి ఖాజురియా, ప‌వ‌న్ రావ్‌లు మొద‌టి, రెండో ర‌న్న‌ర‌ప్‌లుగా నిలిచారు. 17 మంది పురుషులు పాల్గొన్న ఈ పోటీ విజేత‌లకు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ బ‌హుమ‌తులు అంద‌జేసింది. గ‌తేడాది జ‌రిగిన మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ పోటీల్లో భార‌త దేశానికి చెందిన రోహిత్ ఖండేల్ వాలా విజేతగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

గ‌తేడాది మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్‌గా హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖండ్వేలాల్ విజేతగా నిలిచి, భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. మిస్టర్ ఇండియా 2017 గా నిలవడంపై జితేశ్ సంతోషం వ్యక్తం చేశాడు. అంతకు ముందు న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... తనకు అవకాశం లభిస్తే 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటం తెచ్చిపెట్టిన మానుషీ చిల్లార్‌ మాదిరిగా దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తానని అన్నారు. ఈ పోటీల్లో నటి కంగనా రనౌత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.