Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చౌటుప్పల్ లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా

Category : world

క్రిస్మస్ వేడుకలు రెండు తెలుగు రాష్ర్టాల్లో ఘనంగా జరుపుకున్నారు. తోటి వారికి శుభక్షాలు చెపుతు వారి వారి స్థాయిని బట్టి చర్చులు అలంకరణ, కేకులు కట్టింగ్ వంటి కార్యక్రమాలతో ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్-2017 ఎస్మా వోలోడేర్ సోమవారం సందర్శించారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి చౌటుప్పల్ వచ్చిన ఆమె. తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆమె కేక్‌ కట్‌ చేసి, పాఠశాలలోని విద్యార్థుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాలలో జరిగిన డాన్స్‌ పోటీలలో బాలికలతో కలసి డాన్స్‌ చేశారు. అందరినీ అలరించారు. భారతీయుల సంస్కృతి సంప్రదాయాలు తనకు బాగా నచ్చాయని ఆమె అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ విద్యా విధానం గురించి తెలుసుకునేందుకు వచ్చానని ఎస్మా తెలిపింది. బాలికలు ఆత్మ విశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్మా హాజరయ్యారు. గురుకుల పాఠశాల అధికారుల విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్‌లోని గురుకుల పాఠశాలకు వచ్చారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు.

Related News