//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సర్జికల్ స్ట్రైక్ 2 లో మిరేజ్ 2000 సత్తా ... కార్గిల్ వార్ లో సత్తా చాటిన మిరేజ్ 2000

Category : world

పుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది.తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్‌తో దాడి చేసింది. భారత్ చేసిన ఈ భీకర ఎటాక్‌లో ఉగ్రవాద శిబిరాలన్నీ నేలమట్టం అయ్యాయి. సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వెయ్యికిలోల బాంబులతో దాడి చేసి మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్‌ తమ సత్తా చాటాయి.

దసాల్ట్ మిరేజ్ 2000 ...ఒక ఫ్రెంచ్ మల్టీలెవల్, డస్సాల్ట్ ఏవియేషన్ చేత తయారు చేయబడిన సింగిల్-ఇంజన్ నాలుగో- జనరేషన్ జెట్ యుద్ధ విమానం. 1970వ దశకం చివరిలో ఫ్రెంచ్ వైమానిక దళం (ఆర్మీ డి ఎల్' ఎయిర్) కోసం మిరేజ్ III స్థానంలో తేలికైన యుద్ధ విమానం గా రూపొందించబడింది మిరేజ్ 2000. మిరేజ్ 2000 యుద్దవిమానాలను అనేక దేశాలకు విక్రయిస్తుంది దసాల్ట్ . ఈ యుద్ధ విమానాల తయారీ కంపెనీ మిరేజ్ 2000-5 మరియు అనేక ఎగుమతి రకాలుగా అభివృద్ధి చెందింది. 600 పైగా విమానాలను తయారు చేసి 9 దేశాలకు యుద్ధ విమానాలను అందిస్తుంది. కార్గిల్ వారిలో కూడా ఈ యుద్ధ విమానాన్ని చాలా ఎక్కువగా వినియోగించారు. మిరేజ్ 2000 విమానాన్ని తయారుచేసిన దసాల్ట్ కంపెనీ ప్రస్తుత రాఫెల్ యుద్ధ విమానాల తయారీ వివాదంలో ఉంది .

జైషే మహ్మద్ తీవ్రవాద శిబిరాలే టార్గెట్‌గా వైమానిక దళం దాడులు చేసింది .పీఓకేలోని బాల్‌కోట్ కేంద్రంగా ఉన్న జేషే మహ్మద్ ఉగ్రవాద శిబిరం ధ్వంసం అయినట్లు సమాచారం. మొత్తం 12 యుద్ధ విమానాలతో దాడులకు దిగింది భారత్. కార్గిల్ యుద్ధం తర్వాత వైమానిక దళం దాడులు చేయడం ఇదే తొలిసారి. మోదీ ఆదేశాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పని పూర్తి చేసింది. మరోవైపు పీఓకేలోకి భారత్ యుద్ధ విమానాలు వచ్చినట్లు పాకిస్థాన్ కూడా ప్రకటించింది.మొత్తానికి కార్గిల్ వార్ లో సత్తా చూపించిన మిరేజ్ 2000 ఇప్పుడు జరుగుతున్న దాడుల్లో మరోమారు సత్తా చాటుకుంది.