//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుంటూరు జిల్లాలో దారుణం ... నాలుగేళ్ల చిన్నారిని, 10 ఏళ్ళ చిన్నారిని కాటేసిన కామాంధులు

Category : state

ఏం మారలేదు.. బాలికలను కాపాడటానికి ఎన్ని చట్టాలున్నా అవన్నీ నిష్ప్రయోజనమే అవుతున్నాయి. రోజుకో చోట బాలికలపై అత్యాచార ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి రాకుండా చీకటిలోనే కలిసిపోతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మనుషుల మని మరిచి పశు ప్రవృత్తితో కామాంధులు అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రెండు అత్యాచార ఘటనలు గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి.

గుంటూరు జిల్లా గురజాల మండలం నాలుగేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం సెలవుదినం కావడంతో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని నూతన నాగిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకు వెళ్లి తలుపులు వేసాడు చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడ, ఇక్కడ వెతికి చివరికి నాగిరెడ్డి ఇంటి తలుపులు కొట్టారు. మద్యం మత్తులో తలుపులు తీసిన నాగిరెడ్డి ఇంట్లో మంచం పైన చిన్నారి ఉండటం చూసి అనుమానించిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చిన్నారిని గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఇదే జిల్లాలో దాచేపల్లి మండలం లో మరో ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాల్పడినట్టు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం రోజు పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని, తిరిగి ఏ సమయమైనా ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడ అపస్మారకస్థితిలో ఉన్న కుమార్తెను చూశారు. ఇంతకీ ఆమె స్పృహలోకి రాకపోవడంతో ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక చెప్పిన విషయాన్ని విని నిర్ఘాంతపోయారు. తనతో నిద్ర మాత్రలు మింగించి తన సహ విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడినట్టు బాలిక చెపింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా రోజుకో చోట బాలికలపై మృగాళ్లు దాడులకు పాల్పడుతుంటే కేసులు పెట్టి జైలుకు పంపించడమే తప్ప, బాలికల పై దాడులు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరగడం లేదు. అలాంటి ప్రయత్నం జరగాలంటే ముందు పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో నైతికత పెంపొందించాలి. ఏది మంచి ఏది చెడు అనే ఇంగిత జ్ఞానాన్ని ముఖ్యంగా మగ పిల్లలకు నేర్పించాలి. అలా చేయగలిగితే కాస్తయినా భావితరాల్లో అయినా మార్పు వస్తుంది. ఇక చిన్నారులపై విధంగా దాడులకు పాల్పడుతున్న పెద్దవాళ్లకు కఠినతరమైన శిక్షలు అమలు చేయాలి. బాలికలను కాపాడటానికి సమాజం సైతం తన వంతు ప్రయత్నం చేయాలి.