//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయసాయికి కౌంటర్ ఇచ్చిన మంత్రి

Category : politics state

వైకాపా రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి కాలువ శ్రీనివాసులు స్పందించారు. తెదేపా ఎమ్మెల్యేలు వైకాపాతో టచ్ లో ఉన్నారని ఎంపీ విజయసాయి చెప్పడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే జగన్ తీరుకు బాధితులైన పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిన విషయాన్ని విజయసాయిరెడ్డి మరిచిపోయారని అన్నారు. ప్రస్తుతం వైకాపాలో ఉన్న ఎమ్మెల్యేలు తెదేపా నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలుసుకుంటే మంచిదని విమర్శించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యేల్లో తిరిగి పోటీ చేయడానికి ఎంతమంది సిద్దంగా ఉన్నారో తెలుసుకుంటే విజయసాయిరెడ్డికి తన పార్టీ పరిస్థితి గురించి స్పష్టత వస్తుందని హితవు చెప్పారు. వారందరు జగన్ తీరుతో విసిగిపోయారని అన్నారు. కాగా ఇటీవల విజయసాయి రెడ్డి మాట్లాడుతూ గాజువాకలో.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తాము జగన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం నేతల అవినీతిపై విచారణ జరుపుతామని అన్నారు.