//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ తో వైసీపీ.. చెప్పింది చేయకుంటే మళ్ళి రాష్ట్ర విభజన..!

Category : politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం తలపెడుతున్న బీజేపీ తోడుగా నేనున్నానంటూ జగన్ తీరు పై సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు అధికారం కోసం ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించారు. నేడు మళ్ళి విభజన సిద్ధాంతాన్ని బీజేపీ మరోసారి తెర మీదకు తెస్తోందని మండిపడ్డారు. ఈ రోజు ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ, అధికారంలో ఉన్న బీజేపీ చెప్పినట్టు చేయకుంటే, ఏపీని మ‌రోసారి విడదీస్తామన్నట్టుగా బీజేపీ పార్టీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని సోమిరెడ్డి ఆరోపించారు.

మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీపై విశ్వాసం ఉందంటూనే, కేంద్ర ప్ర‌భుత్వం అవిశ్వాసం పెడ‌తామ‌ని వైసీపీ అంటోంద‌ని ఆయన అన్నారు. బీజేపీతో కుమ్మకై వైసీపీ ఏపీ రాష్ట్రానికి తీవ్ర ద్రోహానికి పాల్పడుతున్నారని అయన మండిపడ్డారు. జ‌గ‌న్ లాంటి ఆర్థిక నేరగాళ్లకు మోదీ అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారని ఆయ‌న నిల‌దీశారు. బీజేపీ, వైసీపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయానికి పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు.