//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి సోమిరెడ్డి..!

Category : politics

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. రూ.19,070తో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

వ్యవసాయ రంగంలో 25 శాతం వృద్ధి రేటు సాధించామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. వంద శాతం రాయితీతో సూక్ష్మ పోషకాలు అందిస్తున్నామని, విత్తణ పంపిణీలో జాతీయస్థాయి అవార్డు సాధించామన్నారు.

ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.19,070 కాగా, రెవెన్యూ వ్యయం రూ.18,602 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.468 కోట్లు.రెండో అర్థ సంవత్సరంలో 24.5 శాతం వృద్ధి సాధించామని, జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 14 శాతం అధికంగా నమోదయిందని చెప్పారు.

వ్యవసాయ బడ్జెట్‌లో ముఖ్యంశాలు :

90 శాతం రాయితీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ

ఉత్తరాంధ్రలో దిగుబడి పెంపునకు 50శాతం రాయితీతో విత్తనాలు

తంగడెంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు

వరి నేరుగా విత్తుకునే విధానంతో అధిక దిగుబడులు

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం

అన్ని జిల్లాలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం విస్తరణ

ఊబర్ ద్వారా యంత్రపరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం

దేశంలో తొలిసారిగా 7 లక్షల మంది కౌలు రైతులకు రుణాలు

జైకా ప్రాజెక్టు కింద వ్యవసాయ యంత్రాల శిక్షణా కేంద్రాలు

అనంతపురంలో బిందు, తుంపర పరికరాల కేంద్రాలు ఏర్పాటు

ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం