//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సొంత ప్రభుత్వంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

Category : national politics

ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ (సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయుల డీఎన్ఏలోనే అవినీతి ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.శుక్రవారం హమీన్‌పూర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ‘‘దేశంలోని 100 కోట్ల భారతీయుల నరనరాల్లో అవినీతి పేరుకుపోయింది. దాన్ని తీసేయడం చాలా కష్టమైన పని. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన ఈ జాడ్యాన్ని ఒక్కసారిగా తొలగించటం కష్టం.

అందుకే నెమ్మదిగా పెకలించివేయాలి’’ అని అన్నారు.అయితే అవినీతి విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మినహాయించారు. అంతే కాకుండా అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి పోరాటం చేస్తున్నారని, అది అభినందించదగ్గ విషయమని కొనియాడారు. మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్‌ లు ఎస్సీ/ఎస్టీ న్యాయపరమైన డిమాండ్ల విషయంలో ఎలాంటి శ్రద్ధ కనబరచటం లేదని రాజ్భర్‌ అన్నారు.