//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రదీప్ 'వినతి' ట్వీట్ కి మంత్రి కేటీఆర్ 'హామీ' ట్వీట్..!

Category : politics

రంగారెడ్డి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం చ‌ర్ల‌ప‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల దుస్థితిని గురించి వివ‌రిస్తూ యాంకర్ ప్ర‌దీప్ ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ఓ ట్వీట్ చేశాడు.ఆ పాఠ‌శాల‌లో 120 మంది బాలికలు,100 మంది బాలురు చదువుకుంటున్నారని,కానీ ఒక్క బాత్రూమ్ కూడా లేదని వీ కేర్ ఎన్జీవో చేసిన ట్వీట్ ను ప్రదీప్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు.

అలాగే ఆ పాఠశాలకు మంచి నీటి సౌకర్యం కూడా లేదని తెలిపాడు.మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాడు.తమ టీమ్ ఆ విద్యార్థుల సమస్యలను పరిశీలించిందని,వారి గురించి పట్టించుకోవాలని ప్రదీప్ కోరాడు.హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కి కూడా ప్రదీప్ ఈ ట్వీట్ చేశాడు.

ఆయన చేసిన విన్నతికి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఆ పాఠశాల విద్యార్థుల సమస్యలను తప్పకుండా తీర్చుతామని ట్వీట్ చేసి హామీ ఇచ్చారు.మేడ్చల్ కలెక్టర్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని,సమస్యను పరిష్కరించి,ఆ విషయాన్ని మళ్లీ తనకు తెలియజేయాలని ఆదేశించారు.

Related News