//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అడ్డంగా బుక్కైన లగడపాటి ... వైరల్ గా మారిన కేటీఆర్ ట్విట్

Category : politics state

మాజీ మంత్రి లగడపాటి రాజగోపాల్ మంగళవారం ప్రకటించిన సర్వే వివరాలు తెలంగాణ లో కలకలం సృష్టించాయి. విజయం ఖాయమని ధీమాగా ఉన్న టీఆర్ఎస్‌కు ఈ సర్వే ఫలితాలు షాక్ కి గురిచేశాయి . మరోవైపు, ప్రజాకూటమి అభ్యర్థుల్లో ఈ సర్వే ఫుల్ జోష్ నింపింది అని చెప్పాలి . ఈ సర్వే పై కేటీఆర్ తనదైన రీతిలో రెచ్చిపోయాడు .

లగడపాటిది చిలుక జోస్యమని ట్విట్టర్‌లో ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ నేత కేటీఆర్ తాజాగా, మరో ట్వీట్ చేశారు. లగడపాటి వెల్లడించిన వివరాలు వాస్తవం కాదని, నిజమేంటో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు . ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు.

టీఆర్ఎస్ విజయం సాధిస్తుందంటూ స్వయంగా లగడపాటి తనకు మెసేజ్ చేశారని పేర్కొన్న కేటీఆర్ ఆ మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మంగళవారం ఆయన వెల్లడించిన సర్వే వివరాలు పూర్తిగా కుట్ర పూరితంగా ఉండడం వల్లే వాటిని ఈ విషయం బయటపెట్టాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చాడు . గత నెల 20 రాజ్‌గోపాల్ తనకు ఓ మెసేజ్ చేశారని, అందులో టీఆర్ఎస్‌కు 65-70 సీట్లు వస్తాయని పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు.

ఏపీ సీఎం ఒత్తిడి మేరకు రాజగోపాల్ తన సర్వేను తారుమారు చేశారని, అంకెలు మార్చారని ఆరోపించారు. ఈ కుట్రను బయటపెట్టేందుకే రాజ్‌గోపాల్‌తో జరిగిన చాటింగ్‌ను బయపెట్టినట్టు పేర్కొన్నారు. కేటీఆర్ బయటపెట్టిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ 65 నుంచి 70 స్థానాల్లో గెలపొందే అవకాశం ఉండగా, ప్రజాకూటమికి 35 నుంచి 40 స్థానాలు వస్తాయి. బీజేపీ 2-3 స్థానాల్లో, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాల్లో విజయం సాధిస్తారు.

Related News