//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మంత్రికి తప్పిన ముప్పు..!

Category : politics

ఈ మధ్య కాలం లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమై పోతుంది .ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో బీసీ సంక్షేమ హాస్టల్‌కు శంకుస్థాపన చేసేందుకు, కెసిఆర్ గారి పుట్టిన రోజు వేడుకల్ని నిర్వహించాడనికి వెళ్లారు. అక్కడ భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడడానికి సభా వేదికను ఏర్పాటు చేసారు. అయన అక్కడికి వెళ్లి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు టపాసులు పేల్చారు.

అయితే ఆ టపాసుల రవ్వలు అక్కడున్న టెంట్లపై పడడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో టెంట్ల కింద ఉన్న వారంతా పరుగు లంకించుకున్నారు. అలాగే మంత్రి సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో మంత్రిని పక్కకు తీసుకెళ్ళడంతో ప్రాణాపాయం తప్పినట్లైంది.అక్కడున్న విద్యార్థులు లు కూడా ప్రాణాలతో బయట పడ్డారు.పోలీస్ లు విచారణ చేస్తున్నారు.

Related News