//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళలపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్ .. ఏమన్నారంటే

Category : politics state

కెసిఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. కొత్త మంత్రివర్గంలోనూ ఒక్క మహిళ కూడా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో తెలంగాణ వచ్చిన తరువాత కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాటు పాలించి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ.. ఆ నాలుగున్నరేళ్ల కాలంలో తన మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. దీంతో అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇక రెండోసారి సీఎం అయిన తరువాతైనా ఆ లోటు భర్తీచేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా మహిళలకు స్థానం కల్పించలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో నిన్న కొత్త మంత్రులను చేర్చుకున్నతరువాత మీడియా వారితో మాట్లాడింది. కేసీఆర్ గత కేబినెట్లో ఉండి మళ్లీ రెండోసారి కూడా స్థానం సంపాదించుకున్న జగదీశ్వర్ రెడ్డిని విలేకరులు ఇదే విషయం అడిగారు. మహిళలకు ఎందుకు అవకాశమివ్వలేదు అని అడిగారు. దానిక ఆయన చెప్పిన సమాధానం విని విలేకరులే కాదు యావత్ తెలంగాణ ప్రజలూ షాకయ్యారు. ‘‘మహిళలు ఇంట్లో ఉన్నారు కదా..’’ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

దీంతో విలేకరులు.. ఇదేంటని ప్రశ్నించగా.. ఆయన కవర్ చేసుకుంటూ.. మహిళలు ఇంట్లో ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నారు కదా అన్నట్లుగా మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలోనూ దుమారం రేగింది. తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద దీనిపై స్పందిస్తూ... మంత్రి ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. కేసీఆర్ ఎందుకు మహిళలను మంత్రులుగా తీసుకోవడం లేదన్న దానిపై ఇప్పటికే బోలెడన్ని సెటైర్లు కూడా పడుతున్నాయి. ఎవరైనా స్వామీజీ మంత్రివర్గంలో మహిళా ఉంటే కెసిఆర్ కు కలిసి రాదని చెప్పారేమో .. అందుకే కేసిఆర్ మహిళలను తన క్యాబినెట్ లో తీసుకోవడం లేదేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు.