//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముఖ్యమంత్రి లక్ష్యంగా మంత్రి విమర్శలు

Category : state national politics

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ పై సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత, కేబినెట్‌ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భార్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కైరానా లోక్‌సభ, నూర్‌పూర్‌ అసెంబ్లీ స్థానాల్లో భాజపా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి... ‘అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా.. కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను మొదట సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసింది.

కానీ తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మౌర్య సీఎం అవుతారనే ఆశతో వెనుకబడిన వర్గాలు భాజపాకు ఓటేశాయి. వారి ఆగ్రహం వల్లే ఈ ఉప ఎన్నికల్లో భాజపా ఓడిపోయిందని.. అంతే కాకుండా ‘ఓటమికి బాధ్యత ప్రభుత్వానిది. ఓటమికి గల కారణాలపై భాజపా పునఃపరిశీలించుకోవాలి. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే అంశం భాజపాకు సంబంధించిన అంశం. యోగిని లేదా కేశవ్‌ను సీఎం చేసే అంశం పార్టీకి సంబంధించినది’ అని ఆయన పేర్కొన్నారు.