//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అధికారుల తాట తీస్తా.... మంత్రి అఖిల ప్రియ షాకింగ్ కామెంట్స్

Category : politics

ఏపీ మంత్రి Bhuma Akhila Priya తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల తాట తీస్తానని హెచ్చరించారు. తన తండ్రి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన Akhila Priya తన తండ్రిని గతంలో ఇబ్బంది పెట్టిన అధికారుల లెక్క తేల్చే దాకా నిద్రపోనని చెప్పారు. తాను దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ధిని అడ్డుకుంటే తాట తీస్తానని సీరియస్ వార్నింగ్ ఇవ్వటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

చిన్న వయసులోనే రాజకీయాలోకి అడుగు పెట్టిన అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత అనూహ్యంగా మంత్రి అయ్యారు.తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నారు. అయితే నంద్యాల మండలంలో తమ దత్తత గ్రామం కొత్తపల్లిని సంద‌ర్శించిన Akhila Priya అధికారుల‌పై సీరియ‌స్ అయ్యారు. గ్రామాభివృద్ధికి అడ్డు పడే అధికారులను ఉపేక్షించనని హెచ్చరించారు. గతంలో తన తండ్రిని కూడా అధికారులు ఇబ్బందులకు గురి చేశారని చెప్పిన అఖిల ప్రియ ఆ లెక్క తెల్చుతానని చెప్పారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచిన భూమా నాగిరెడ్డి, Akhila Priya త‌ర్వాత కొద్ది రోజుల‌కే టీడీపీలో చేరిన విష‌యం తెలిసిందే.ఈ క్ర‌మంలో వైసీపీలో ఉన్న స‌మ‌యంలో త‌న‌ తండ్రిని కొంత‌మంది అధికారులు అవ‌మానించార‌ని, వారి లెక్క తేల్చే వరకు విశ్రమించేది లేదంటూ అఖిల ప్రియ సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. త‌న ద‌త్త‌త గ్రామం వ‌చ్చిన అఖిల ప్రియ, త‌న తండ్రిని గుర్తు చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి నంద్యాలకు వచ్చినప్పుడు.. అధికారులు ఆయనపై కేసులు పెట్టి చాలా ఇబ్బందుల‌కు గురి చేశార‌న్న Akhila Priya, అన్ని లెక్కలు వేసుకున్నానని హెచ్చ‌రించారు. కొత్తపల్లికి ప్రతి రోజు వస్తానని, ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరిస్తామని చెప్పిన అఖిల ప్రియ అడ్డుకునే వాళ్ళ తాట తీస్తానని చెప్పి సంచలన వ్యాఖ్య చేశారు.

Related News