//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పని మనుషులకు కనీస వేతనాలు!

Category : national

పనిమనుషులకు కనీస వేతనాలు, వేధింపుల నుంచి రక్షణ, కార్మిక సంఘాల ఏర్పాటుకు అవకాశం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వారికి చట్టబద్ధమైన హోదా కల్పించాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పని మనుషుల కోసం ఓ జాతీయ విధానాన్ని రూపొందిస్తున్న మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రజల నుండి అభిప్రాయాలు కోరింది. రెండు పేజీల బహిరంగ నోటీసులో విధానం రూపురేఖలను వివరించిన కేంద్రం, వాటిపై తమ అభిప్రాయాలను వచ్చే నెల 15 లోగా తెలుపాలని పేర్కొంది. ఈ విధానం అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న 47.5 లక్షల మంది పనిమనుషులు లబ్ధిపొందగలరని తెలిపింది. పని మనుషులు కూడా ఇతర విభాగాల కార్మికుల మాదిరిగా హక్కులు పొందేందుకు ప్రస్తుత చట్టాలను, విధానాలను, పథకాలను వారికి అమలు పరచాలన్నది తాము రూపొందిస్తున్న జాతీయ విధానం లక్ష్యమని తెలిపింది.వారికి కూడా కనీస వేతనాలు, సమాన పారితోషికం లభించాలని పేర్కొంది. ఇంతకుముందు విడుదల చేసిన ముసాయిదాలో పనిమనుషుల కనీస వేతనాన్ని రూ.9 వేలుగా పేర్కొన్న కేంద్రం తాజా నోటీసులో మాత్రం ఎటువంటి మొత్తాన్ని ప్రస్తావించలేదు. పని మనుషులు రోజుకు 12 గంటలు వేర్వేరు ఇండ్లలో పనిచేస్తున్నా తమ కుటుంబ పోషణకు అవసరమైనంతగా సంపాదించలేకపోతున్నారు. అనేకమంది శారీరక, మానసిక వేధింపులను ఎదుర్కొంటుంటారని, వారి సమస్యలను వినే వేదిక కూడా లేదని అధికారులు పేర్కొన్నారు.ఈ అంశాలలో ప్రభుత్వం రూపొందిస్తున్న జాతీయ విధానం వారికి ఎంతో ఊరటను కలిగించగలదని అన్నారు.