//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ బామ్మ డ్యాన్స్ చూస్తే షాకే....వీడియో వైరల్

Category : national

భారత దేశంలో క్లాసికల్ డ్యాన్స్ కి పెట్టింది పేరు. అయితే సాంప్రదాయ నాట్యం నేర్చుకున్న వారు ఏ వయసులో అయినా సరే మర్చిపోరని ఓ బామ్మ నిరూపించింది. 1956లో బాలీవుడ్ లో వచ్చిన పరివార్ సినిమాలో లతామంగేష్కర్ పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లతామంగేష్కర్ పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్ కావడం ఏంటా అనుకుంటున్నారా..అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండీ..ఈ పాటపై 70 సంవత్సరాల బామ్మ పాటకు డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

అధ్బుతమైన స్టెప్పులతో వీడియోలో 1.5 నిమిషాల పాటు డాన్స్ చేసింది. డిసెంబర్6 న పోస్ట్ చేసిన ఆ వీడియో ఇప్పటి వరకు 1 లక్ష షేర్లు,లైక్ లతో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. అయితే కొంత మంది నెటిజన్లు తమ బామ్మలను మిస్ అవుతున్నామని ఇలాంటి బామ్మలను చూస్తుంటే ఎంతో స్ఫూర్తి అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు