//single page style gallary page

Milky Beauty Tamanna has two desperate desires you know that

Category : movies

Click here to read this article in Telugu

మిల్కీ బ్యూటీ తమన్నా కు రెండు తీరని కోరికలు ఉన్నాయట..... అవేంటో తెలుసా....?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన " శ్రీ " అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ మిల్కీ బ్యూటీ తమన్నా....ఆ సినిమా తరువాత ఆమె నటించింది హ్యాపీ డేస్ సూపర్ హిట్ అవ్వడంతో ఆమె కు టాలీవుడ్ లో తిరుగు లేకుండాపోయింది. ఇక ఆమె తాజాగా తెలుగు లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎఫ్ -2’ ఈ సినిమాతో మరో సారి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కింది తమన్నా. ఈ సినిమా తర్వాత ఆమె ‘అభినేత్రి- 2’ సినిమాతో మరో సారి తెలుగు,తమిళ్ ,హిందీ ప్రేక్షకులను పలకరించింది. అంతేకాదు ఈమె ‘ఖామోషీ’ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే ఈమె ముఖ్యపాత్రలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా కూడా రిలీజ్ కు సిద్దం గా ఉంది.

ఈ సినిమా హిందీలో కంగనా హీరోయిన్‌గా నటించిన ‘క్వీన్’ సినిమాకు రీమేక్. ఈ సినిమాను దక్షిణాదిలో వివిధ భాషల్లో వివిధ హీరోయిన్లతో రీమేక్ చేసారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కూడా ఓ ముఖ్యపాత్రలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 2న దసరా సెలవుల్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు ఈ సినిమా యూనిట్ . ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవితో పాటు తమన్నా ధరించే దుస్తులను.... చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో డిజైనర్ అంజు మోదీ కలిసి డిజైన్ చేసినట్టు తమన్నా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

ఈ సినిమాలో తమన్నా భారీ లెహెంగాలు ధరించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ‘బాహుబలి’ సినిమాలో తాను ఉపయోగించిన దుస్తుల కన్నా ఈ సినిమాలో తాను ఉపయోగించిన కాస్ట్యూమ్స్ తనను ఎక్కువగా సర్‌ప్రైజ్ చేశాయని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు ఆమెకు పరిశ్రమలో త రెండే రెండు తీరని కోరికలు ఉన్నాయని. అందులో ఒకటి డాన్స్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటించాలని. మరోకటి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కిస్తే.. అందులో ఆమె క్యారెక్టర్ చేయాలని ఉందని తమన్నా చెప్పుకొచ్చింది. అందుకే అప్పట్లో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ‘హిమ్మత్‌వాలా’ సినిమాను రీమేక్ చేసినట్టు ఈ సంధర్బంగా చెప్పుకొచ్చింది తమ్ము బేబీ.

Manchu Mana, who introduced the Telugu film "Sree" in the Tollywood film industry, is the heroine of the film, after which she starred in Happy Days Super Hit and she was left in Tollywood. Her latest Telugu film "F-2", which is a Telugu blockbuster movie, After this, she has been greeted by Telugu, Tamil and Hindi audiences with 'Abhinitri-2'. She is also acting in 'Khamoshi'. Also, 'Dattaj Mahalakshmi' is the main role in the film.

The film is a remake of the film 'Queen' in Kangana's heroine in Hindi. The film has been remade in various languages with different heroines in the south. The film will soon be released. On the other hand, Tamanna is directed by Surender Reddy and mega star Chiranjeevi's hero Ram Charan is also directing the film 'Sira Narasimha Reddy'. The film is about to be released on Dussehra vacation on October 2. In the film, Tamanna said in an interview with an English media that designer Anju Mudhi was modeled on Mega Star Chiranjeevi and Tamanna worn by her older daughter Sushmita.

She said she was wearing huge lehenga in the film. She said that the costumes she used in the film have surpassed her more than the dress she used in 'Bahubali'. On the other hand she has two desperate wishes in the industry. One of them is to dance in the backdrop of dancing in the background. Tamanna said that she would like to do the script of Sridevi's biopic. That's why Sridevi has remade the movie 'Himmatwala' as heroine.