18 ఏళ్ల క్రితం క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన మిథాలీరాజ్ ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో పలు రికార్డులతో మరోసారి మెరిసింది. భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వరుసగా ఏడో అర్థ సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో 71 పరుగులతో చివరి బంతికి అవుటైన మిథాలీ పలు రికార్డులను సాధించింది.
ఈ సీజన్లో అంతకుముందు 70, 64, 73,51,54,62 స్కోర్లతో ఆరు హాఫ్ సెంచరీలను నమోదు చేసింది. తాజా అర్ధ సెంచరీతో మిథాలీ అత్యధిక అర్ధ సెంచరీలను సాధించి క్రికెటర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఎడ్వార్డ్స్ 191 మ్యాచ్‌ల్లో 46 అర్ధ సెంచరీలే అత్యధికం.
100 వన్డేలను పూర్తి చేసుకున్న మిథాలీ సగటు 52.27గా ఉంది. ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ 50 వన్డేల్లో 52.37 సగటుకు రాజ్ చేరువైంది. మహిళా క్రికెట్లో 5వేల పరుగులు సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా మిథాలీ తన పేరును లిఖించుకుంది. 178 మ్యాచ్‌ల్లో ఈ మ్యాచ్‌తో కలిపి 5,852 పరుగులను సాధించింది. ప్రపంచకప్‌లోనే ఆరువేల పరుగుల మైలురాయికి చేరుకునే అవకాశం ఉంది.