//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్లౌడ్ కంప్యూటింగ్ వైపు మైక్రోసాఫ్ట్... వేలాది మందికి ఉద్వాసన

Category : business

ప్రపంచంలో  అగ్రగామి ఐటి సంస్థ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ నుండి క్లౌడ్ కంప్యూటింగ్, బిజినెస్ సేవల వైపు ద్రుష్టి సారిస్తూ ఉండడంతో వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలక వలసి వస్తున్నది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే గత మూడేళ్ళలో 30,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది.  

ఇప్పుడు ప్రపంచం డిజిటల్ మయం అవుతూ ఉండడంతో తమ వ్యాపార సరళిలో సహితం పెను మార్పులు వస్తున్నట్లు ఈ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ నుండి క్లౌడ్ కంప్యూటింగ్, బిజినెస్  సేవలకు ఇప్పుడు  డిమాండ్ పెరుగుతూ ఉండడంతో అటువైపు ద్రుష్టి సారిస్తున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల తెలిపారు. 

భారీ బహుళ జాతి సంస్థల నుండి చిన్న చిన్న వ్యాపార  సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు కూడా ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు మారడం  కోసం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వేదికలను వాడుతున్నట్లు ఆయన చెప్పారు. 

దానితో పర్సనల్ కంప్యూటింగ్ లో రాబడి తగ్గి, క్లౌడ్, వ్యాపార సేవలలో పెరుగుతున్నది. ఈ కంపెనీ ప్రధాన వ్యాపార వేదిక అయిన విండోస్ కు కూడా ఇప్పుడు రాబడి తగ్గుతున్నది. `ఇంటెలిజెంట్ క్లౌడ్' నుండి ఆదాయం గత సంవత్సర కాలంలో 11 శాతం పెరిగింది. ఆఫీస్ వినియోగ ఉత్పత్తులు, క్లౌడ్ సేవల ఆదాయం 15 శాతం పెరిగింది. 

అయితే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వేదిక అజురే ప్రముఖ సాంకేతిక సంస్థలైన అమెజాన్, గూగుల్ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి. అవి కూడా కృత్రిమ  మేధస్సు పై విశేషమైన పెట్టుబడులు పెడుతున్నాయి.