//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మైక్రోసాప్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Category : world national business

టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్ ఇండియా తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. సంరక్షకుని సెలవు(కేర్ గివర్ లీవ్) పేరిట నాలుగు వారాల పెయిడ్ లీవ్ ను ప్రకటించింది. కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే వారికి సంరక్షకునిగా ఉండేందుకు ఈ పెయిడ్ లీవ్ ను ఉద్యోగులకు అందించనున్నట్టు మైక్రోసాప్ట్ స్పష్టం చేసింది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తామామలు, తోబుట్టువులు, తాతయ్య, నాన్నమ్మలు, సంతానం వంటి వారిని ఫామిలీ కేర్ గివర్ లీవ్ లో చేర్చింది. ఈ సెలవు కింద ఉద్యోగులకు వేతనం చెల్లించనుంది.

గతేడాదే కంపెనీ ప్రసూతి సెలవు కింద 26 వారాలను తమ ఉద్యోగులకు అందించనున్నట్టు ప్రకటించింది. పురుష ఉద్యోగులు కూడా ఆరు వారాల పితృత్వ సెలవును పెట్టుకోవచ్చని, దీనిలోనే సరోగసీ లేదా దత్తత కూడా ఉంటాయని కంపెనీ ప్రకటించింది. కుటుంబసభ్యులకు వారి అవసరం మేరకు ఉద్యోగులు ఏం చేయాలనిపిస్తే అది చేసుకునే విధంగా తమ విధానాలను రూపొందిస్తున్నామని మైక్రోసాప్ట్ హెచ్ఆర్ అధినేత ఇరా గుప్తా తెలిపారు. సంరక్షకుని సెలవును విస్తరించుకోవచ్చని, ఏడాది అంతా ఉద్యోగి ఏ రూపంలోనైనా దీన్ని వాడుకోవచ్చని పేర్కొన్నారు. భారత్ లో మైక్రోసాప్ట్ కు 8వేల మంది ఉద్యోగులున్నారు. ముఖ్యంగా మహిళలు వర్క్ చేస్తున్న ప్రాంతాల్లో తీసుకున్న మంచి నిర్ణయం ఇదేనని కన్సల్టెంట్స్ చెబుతున్నాయి.