//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చైనా కోసం సీక్రెట్‌ వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టం

Category : business national

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్లకు పైగా కంప్యూటర్లలో రన్‌ అవుతున్న విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టం మరింత పాపులరయ్యే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో విండోస్‌ 10కి సీక్రెట్‌ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోందట మైక్రోసాఫ్ట్‌. అయితే ఆ వెర్షన్‌ను అందరూ వినియోగించడానికి వీలుండదట. చైనా ప్రభుత్వం డిమాండ్‌ మేరకు చైనీయుల కోసమే ఆ వెర్షన్‌ను మైక్రోసాఫ్ట్‌ సిద్ధం చేస్తోందట.

2015 జూలై 29 ప్రపంచ మార్కెట్‌లోకి విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంను మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. చైనా మాత్రం దానికి అనుమతి నిరాకరించింది. తమ దేశ నిబంధనల ప్రకారం అందులో భద్రతా లోపాలు ఉన్నాయని తేల్చి చెప్పింది. తాము చెబుతున్న మార్పులతో కొత్త వెర్షన్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేసింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా మార్కెట్‌కు దూరం కాకూడదన్న ఆలోచనతో మైక్రోసాఫ్ట్‌ అక్కడి ప్రభుత్వ డిమాండ్‌కు అంగీకరించిందట. అందుకే ఓఎస్‌లో పలు మార్పులు చేయడంతో పాటు భద్రతాపరమైన కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిందట. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న విండోస్‌ 10తో పోల్చితే చైనా వెర్షన్‌లో చాలా మెరుగైన ఫీచర్లు ఉన్నట్లు చెబుతున్నారు.