ఐపీల్ ప్రారంభం కాకముందే ఒక్కొక్కరిగా స్టార్ ప్లేయర్స్ ఈ టోర్నీకి దూరమౌతున్నారు. బాల్ టాంపరింగ్ వివాదం లో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్, వార్నర్ లు ఇప్పటికే టోర్నీకి దూరమయ్యారు. ఇప్పుడు మల్లి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. ఇప్పటికే భుజ గాయంతో మరో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌లీన్ దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో స్టార్క్‌ను కోల్‌కతా రూ. 9.4 కోట్లకు సొంతం చేసుకున్నారు . ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌లీన్ దూరం చేసుకున్న కోలకతా మరో స్టార్ బౌలర్‌ను కోల్పోవడం ఫ్రాంచైజీని కలవర పెడుతోంది.
దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో టెస్టు ముందు మిచెల్ స్టార్క్ కుడికాలికి గాయమైందని అతని స్థానంలో 31 ఏళ్ల చాధ్ సేయర్స్ అరంగేట్రం చేయనున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. దీంతో అతను ఆసీస్‌కు తిరుగు పయనమయ్యాడని, భవిష్యత్తు టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా స్టార్క్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు సైతం దూరం కానున్నాడని ట్వీట్ చేసింది. ఇక స్టార్క్ గాయంతో గత సీజన్ ఐపీఎల్‌కు సైతం దూరమయ్యాడు.