//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశీయ మార్కెట్లోకి మెర్సిడెజ్ బెంజ్ కారు

Category : business

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి మరో రెండు ఎస్‌యూవీలను విడుదల చేసింది. వీటిలో రూ.2.17 కోట్ల ధర కలిగిన ఏఎంజీ జీఎల్‌ఎస్63తో పాటు రూ.1.58 కోట్ల విలువైన ఏఎంజీ జీ 63 ఎడిషన్ 463 కూడా ఉంది. ఈ ధరలు పుణె షోరూంకు సంబంధించినవి. ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు కార్లను విడుదల చేసినట్లు, వీటితో ఈ విభాగంలో లభించనున్న కార్ల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నట్లు మెర్సిడెజ్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోలాండ్ ఫోల్జర్ తెలిపారు.

5.5 లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఏఎంజీ జీ 63 కారు 5.4 సెకండ్లలో సున్న నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం ఈ కారు ప్రత్యేకత. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి 13 కార్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఈ రెండు కార్లను ప్రవేశపెట్టడంతో సంఖ్య 6కి చేరింది. జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థ 3,650 యూనిట్ల వాహనాలను దేశవ్యాప్తంగా విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో విక్రయించిన 3,622 యూనిట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. గతేడాది మొత్తానికి సంస్థ 13,231 యూనిట్ల విక్రయాలు జరిపింది.