//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎటిఎంలో డబ్బులు రావట్లేదని...

Category : state

ఎటిఎంలో నగదు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యక్తి పిన్ తప్పు కొట్టి ఎటిఎంలో నగదు రావడం లేదని తన కోపాన్ని ప్రదర్శించాడు. ఏకంగా స్క్రీన్ పగలకొట్టాడు. హైదరాబాద్ చందానగర్ పరిధిలోని నల్లగండ్ల ఫ్లైఓవర్‌ సమీపంలో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏటీఎంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు డ్రా చేయటానికి వెళ్లాడు. పిన్‌ నెంబర్‌ తప్పు కొట్టడంతో డబ్బులు రాలేదు. మూడుసార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. డబ్బులు రాలేదన్న కోపంతో ఏటీఎం స్ర్కీన్‌ను బండరాయితో పగులగొట్టాడు. ఈ విషయమై బ్యాంకు సిబ్బంది పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.