Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గనున్న మెగాస్టార్!!

Category : movies

ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా షూటింగులో బిజీగా వున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు.చిరంజీవి కథానాయకుడిగా ఒక సందేశాత్మక చిత్రాన్ని రూపొందించడానికి కొరటాల సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది..ఈ కథలో సందేశం ఉన్నప్పటికీ, చిరంజీవి మార్క్ ఫైట్లు.డాన్సులు కూడా ఉంటాయట.అందువలన బరువు తగ్గవలసిందిగా చిరంజీవికి కొరటాల శివ సూచించినట్టు తాజా సమాచారం. 'సైరా' సినిమా లో తన పాత్ర బరువు పెరిగిన చిరంజీవి, ఇప్పుడు కొరటాల సినిమా కోసం బరువు తగ్గనున్నారు.ఆల్రెడీ ఆయన జిమ్ కి వెళుతూ కసరత్తులు మొదలెట్టేశారని అంటున్నాయి సినీ వర్గాలు.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related News