Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మెగాస్టార్ చింజీవి "సైరా నరసింహ రెడ్డి" రిలీజ్ డేట్ ఫిక్స్ సెంటిమెంట్ గా ఆ రోజునే రిలీజ్

Category : movies

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథకు ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం " సైరా" నరసింహా రెడ్డి. తన సినిమా కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ను భారీ అంచనాలే నెలకొన్నాయి.ముఖ్యంగా ఈ సినిమా విడుదల పై మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఓ కీలక ప్రకటన చేసింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ సినిమా ను అక్టోబరు 2న గాంధీ జయంతినాడు విడుదల చేస్తారని, లేకపోతే 2020 సంక్రాంతికి విడుదల చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. ఈ ఉచిత ప్రచారాన్ని తెరదించుతూ.. అక్టోబరు 2నే సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బ‌ృందం.

సినిమా చిత్రీకరణ పూర్తయిందని, చిరంజీవి డబ్బింగ్‌ చెప్పడానికి సిద్ధమవుతున్నారని కూడా సమాచారం ఇచ్చింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ తేజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబరు 2నే చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయాలని చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా, ఉయ్యాలవాడ గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌, సతీమణి సిద్ధమ్మ పాత్రలో నయనతార, ఇతర కీలక పాత్రల్లో తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అమిత్‌ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్నారు.ఇన్ని భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుం దొ చూడాలి.

Related News