Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఏం చేశాడో తెలుసా ...?

Category : movies

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఇంట్లో వాళ్లకు తెలీకుండా ప్రేమించిన వ్యక్తినే రహస్యంగా వివాహం చేసుకున్న శ్రీజ. సొసైటీ లో మెగాస్టార్ కి ఉన్న పేరు ను ఒక్క సారిగా బజారు లో పడేసింది.ఈ వివాహం తరువాత మెగాస్టార్ ఫ్యామిలీ సైతం ఈ విషయంలో ఎంతగానో బాధ పడ్డారు. ఈ సంఘటన తరువాత చిరు ఫ్యామిలీ కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. కాలేజీ రోజుల్లో ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి శ్రీజ తన తల్లిదండ్రులను ఎదిరించి శిరీష్ భరద్వాజ్ అనే అబ్బాయిని 2007 లో శ్రీజ పెళ్ళి చేసుకోవడం జరిగింది.. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయక తప్పలేదు. ఈ సమయంలోనే శిరీష్ -శ్రీజ జంటకు ఒక పాప కూడా పుట్టింది.

అయితే ఈ ఇద్దరి వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు. కొంత కాలం తర్వాత శ్రీజ తన తల్లిదండ్రుల కుదిర్చిన వివాహం తో వ్యాపారవేత్త అయిన కళ్యాణ్ దేవ్ నీ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సంఘటన తరువాతశిరీష్ భరద్వాజ్ గురించి పెద్దగా ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేదు.తాజాగా శిరీష్ భరద్వాజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో తనను పెళ్ళి చేసుకున్నానని ఏమీ వెల్లడించలేదు.... కానీ ఈ పోస్ట్ చిలుసిన చాలామంది నెటిజనులు "హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అని చెప్పడం గమనార్హం. కొంతమంది మాత్రం కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేస్తున్నారు.

దీంతో శిరీష్ భరద్వాజ్ వివాహం అయి ఉండొచ్చనే అభిప్రాయాలు మొదలయ్యాయి.ఎలాగైతే ఏంటి ఒకప్పుడు శ్రీజ- శిరీష్ భరద్వాజ్ వివాహం మూలాన కోడై కూసిన మీడియా.... సంచలన వార్తగా చూసిన జనాలు ప్రస్తుతం ఈ ఇద్దరినీ మర్చిపోవడం అంతా యాదృచ్ఛికమే...ఇక శిరీష్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంబించడం ఈ సందర్బంగా శుభపరిణామమే అనుకోవాలి.... వైవాహిక జీవితంలో మనస్పర్థల కారణంగా విడిపోతే జీవితం ఆగిపోయినట్టు కాదు. అంతటితో ఆ చాప్టర్ ను క్లోజ్ చేసి జీవితంలో కొత్త పేజీని తెరవడం ఇప్పుడున్న యువత కు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఇద్దరు మాజీ భార్య- భర్తలు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు తెగ బిజీగా కాలం గడపడం గమనార్హం. ఏది ఏమైనా అందరిలాగే మనం కూడా ఆ జంటకు ఆల్ ది బెస్ట్ చెపితే సరిపోతుంది.

Related News