//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైజంతీ మూవీస్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి తుదుపరి చిత్రం?

Category : movies

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహారెడ్డి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. కొణిదల బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్యం వహిస్తుండగా, జగపతి బాబు, నయనతార, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

అయితే చిరజీవి తుదుపరి చిత్రం వైజంతీ మూవీస్ బ్యానర్ లో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వైజంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన 'మహానటి' మూవీ గొప్ప విజయాన్ని అందుకోవడంతో అశ్వని దత్ ని చిరంజీవి ఎంతగానో అభినందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ను ఆయన ఎంతగానో అభినందించారు. నాగ్ అశ్విన్ చిరంజీవి కోసం ఓ కథ ని రెడీ చేస్తున్నాడని, ఆ కథ చిరంజీవికి తగినట్టుగా ఉంటె ఈ సినిమాను తాను నిర్మిస్తానని అశ్వని దత్ అన్నారు.

చిరంజీవి తరువాత మూవీ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అని ప్రచారం జరగడంతో, అశ్విని దత్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఆ ప్రచారంలో నిజం లేదని అశ్విని దత్ అన్నారు. ఇప్పటి వరకు మా బ్యానర్ లో చిరంజీవితో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారని, అయిదవ సినిమా చేసే అవకాశం వస్తే దానిని వదులుకోమని, ఆ విషయాన్ని మేము గర్వంగా చెప్పుకుంటామని తెలియచేసారు.

Related News