//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ " వాల్మీకి " నుంచి తప్పుకున్న దేవీ శ్రీ ప్రసాద్

Category : movies

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరో గా తెరకెక్కుతున్న తాజా చిత్రం "వాల్మీకి".ఈ చిత్రానికి దర్శకుడు గా గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. 2014 లో తమిళంలో సూపర్ హిట్ ఆయన 'జిగర్తాండ' సినిమాకి ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా చేసిన పాత్రలో వరుణ్ తేజ్ .. సిద్ధార్థ్ పాత్రలో అథర్వ నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే ను సంప్రదించగా, ఆమె ఎక్కువ పారితోషికం అడగడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పించునట్టు తెలుస్తుంది. ఇక పోతే ఈ సినిమాకి ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ తాజాగా డిఎస్పీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఇంత సడెన్ గా దేవి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వెనుక పలు అనుమానాలకు తావిస్తున్నాయి.ఇంతకీ అసలు విషయం అయితే తెలీదు కానీ , ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడనేది తాజా సమాచారం. ఆయన స్థానంలో మిక్కీ జె. మేయర్ ను ఈ చిత్ర యూనిట్ తీసుకున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతోనే మిక్కీ జె. మేయర్ బిజీగా వున్నాడని సమాచారం. అంతే కాకుండా త్వరలోనే కథానాయిక ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నాడని టాక్.అయితే హరీష్ శంకర్ , దేవి శ్రీ ప్రసాద్ కాంబో లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ రావడం కూడా చూసాం.కానీ ప్రస్తుతం వీరిద్దరి మద్య ఈ గ్యాప్ ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.