Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓటు హక్కుని ఉపయోగించుకున్న సినీ స్టార్స్

Category : politics

మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీక్లబ్‌లో కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి ఓటు వేశారు. రామ్‌చరణ్ విదేశాలకు వెళ్లడంతో ఓటు వేసే అవకాశం కోల్పోయాడని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు.

రాజకీయాలు చెడిపోయాయని, వాటికి దూరంగా ఉండాలని ఎవరైనా అనుకుంటే, వారికి సమస్యలపై నిలదీసే హక్కుండదని హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇది 'ఓటర్స్ డే' అంటూ, నేడు ప్రతి ఒక్కరూ తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లాలని కోరారు.

నేడు ఓటు వేయడం పౌరుల బాధ్యతని అన్నారు. ఈ విషయంలో అధికారులు ఎంతగా ప్రజల్లో అవగాహన తెచ్చినా, పలువురిలో ముఖ్యంగా యువతలో రాజకీయాలపై ఓ చెడు అభిప్రాయం ఉందని, దాన్ని తొలగించుకుని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించాలని అన్నారు. ఓటేసిన వారికే పాలకులను నిలదీసే హక్కుంటుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు.

ఉదయం 6.50 గంటల ప్రాంతానికే పోలింగ్ స్టేషనుకు వచ్చిన దర్శకుడు రాజమౌళి తన ఓటును వేసేశారు. హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం ఓటేసేందుకు క్యూలో వేచివున్నాడు. ఆపై వచ్చిన పలు సినీ రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఓట్లు వేసేందుకు లైన్ లో నిలబడివున్నారు.