//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పుట్టిన రోజు కానుకగా అవయవ దానం చేసిన మెగా అల్లుడు ...!

Category : movies

‘విజేత’ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..

అయితే ఈ రోజు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు కావడం. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. మరణానంతరం తన అవయవాలు దానం చేస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తూ అంగీకార పత్రంపై సంతకం చేశారు కళ్యాణ్ దేవ్. ఈ పత్రాన్ని అపోలో ఆసుపత్రి వర్గానికి అందజేయడం కూడా జరిగింది.

అదేవిధంగా నేడు మెగాస్టార్ ట్విట్టర్‌లో అడుగుపెట్టిన ఈయన మొదటి ట్వీట్‌గా ఈ అంశాన్నే తీసుకోవటం విశేషం. ‘‘ఒక మంచి కార్యక్రమంతో ట్విట్టర్‌లో అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో.. మరణాంతరం నా అవయవాలు దానం చేయటానికై ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని మొదటి ట్వీట్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నా.. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేటపుడు మనం ఏదీ తీసుకుపోలేం’’ అని పేర్కోంటూ అందుకు సంబంధించిన పిక్స్ ట్యాగ్ చేశారు కళ్యాణ్ దేవ్.

ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్ లోని ఉదార స్వభావానికి హ్యాట్సాఫ్ అంటున్నారు.ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ తన రెండో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.

Related News