//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'వెడ్డింగ్' కి సిద్దమవుతున్న..మెగా డాటర్...

Category : movies

మెగా డాటర్ నాగ బాబు ముద్దు బిడ్డ నీహారిక కొణిదెల, సుమంత్ అశ్విన్ హ్యాపీ వెడ్డింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.

యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.ఈ సినిమా మొత్తం పెళ్లి కాన్సెప్ట్పై తిరుగుతుందని ఆ సినీ యూనిట్ సభ్యులు చెప్పుతున్నారు. పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి ఉండే కన్ఫ్యూజన్స్, ఫ్యామిలీ వంటి అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా విడుదల తేదీని తాజాగా యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా ఫిక్స్ చేశాయి. ఈ సినిమా అయినా మెగా డాటర్ కి హిట్ హిస్తుందని ఆశిద్దాం.