//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జాతీయ వంటకం ఉప్మా అంటూ జోరుగా ప్రచారం

Category : editorial

తెలుగువారు ఎంతగానో ఇష్టపడే ఉప్మా కు ఇప్పుడు అంతర్జాతీయ ప్రాశస్త్యం లభిస్తున్నది. తెలుగులో ఉప్పిండి, కన్నడలో ఉప్పిట్టు, తమిళంలో ఉప్మా అని పిలిచే దీనిని జాతీయ వంటకంగా ప్రకటించాలంటూ జోరుగా ప్రచారం  సాగుతున్నది. ఈ ప్రచారం గురువారం ట్విట్టర్‌లో ప్రారంభమైనది. 

ప్రముఖ భారతీయ చెఫ్‌ లైనా ఫ్లాయిడ్‌ కార్డోజ్, ఆరతి సంపత్‌ల కారణంగా అమెరికాలో కూడా డిష్‌కు ఎంతో పేరు వచ్చింది. ఉప్మాకున్న ప్రత్యేక గుణమేమంటే ఎలా చేసినా బాగుంటుంది. అందుకని వంటల వల్లభులు తమదైన శైలీలో ఉప్మా చేసి ఇతరులను మెప్పించాలనుకుంటారు. 

కొందరు ఉప్మాను పొపు గింజలు, మసాల దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, పశ్చి మిరపకాయలు, ఉల్లిపాయలతో సాదా సీదాగా చేస్తే, మరికొందరు పల్లీలు, కాజు, బఠానీలు జోడిస్తారు. ఇంకొందరు వాటికి టమోటా, బీన్స్, పుట్టగొడుగులు కలిపి చేస్తారు. కొందరు మామూలు నూనెతో చేస్తే మరికొందరు నెయ్యితో చేస్తారు. పచ్చి కొబ్బరి పాలతో కూడా చేస్తారు. ఇంకొందరు మాంసం, చేపలతో ఉప్మా చేస్తారు. 

మన చెఫ్‌ ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ అమెరికాలో జరిగిన రెండు రియాలిటీ కుకింగ్‌ షోలో చికెన్, పుట్టగొడుగులు, కొబ్బరి పాల మిశ్రమంతో ఉప్మా చేసి రెండుసార్లు మొదటి ప్రైజ్‌ కొట్టేశారు. ధాన్యంతో చేసిన బ్రెడ్, చేపలతో ఉప్మా చేసిన ఆరతి సంపత్‌ వెనకబడ్డారు. ఆమె చేసిన డిష్‌ను కూడా ఆవురావురు మని తిన్నారట. ఉప్మాను గోధమ, బియ్యం తదితర రవ్వలతో చేస్తారు.

Related News