//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నవంబర్ 1 నుంచి మీసేవ కేంద్రాలు బంద్....!

Category : state

రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి మీ సేవ కేంద్రాలు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీ సేవ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రాఘవేందర్‌రావు, తెలంగాణ మీసేవ ఫెడరేషన్ అధ్యక్షుడు బైర శంకర్, మీ సేవ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ రావు తెలిపారు.Mee seva centres Bandh from November 1st

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా 4,500 మీ సేవ కేంద్రాలుండగా.. ఇందులో వెయ్యి ఆధార్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు . భద్రత పేరుతో ఆధార్ కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు తరలిస్తున్నారని, దీంతో తమ మనుగడ కష్టమౌతుంది అని చెప్పారు . Mee seva centres Bandh from November 1st

2011 నుంచి కమీషన్ పెంచమని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు నర్సింహులు, శంకర్, మహ్మద్ మోహిద్, సమీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.Mee seva centres Bandh from November 1st

Related News