//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వేధింపులకు మరో మెడికో ఆత్మహత్య.....!

Category : state

రోజు రోజుకి రాష్ట్రం లో బలవన్మరణాల సంఖ్య పెరిగిపోతూవస్తుంది . ముఖ్యంగా గత కొద్దీ రోజులుగా మెడికోల ఆత్మహత్యలు రాష్ట్రం లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఆత్మహత్యలకి కారణం , ఉన్నతాధికారులు , ప్రొఫెసర్లు అనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది.

ఇప్పుడు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల విద్యార్థిని గీతిక ఆత్మహత్య అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఆమె రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తాను ఎదుర్కొంటున్న వేధింపులను ఇంకా భరించే ఓపిక లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సూసైడ్ లెటర్ లో రాసింది.

ఆ లేఖను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. తన తల్లిదండ్రులను క్షమించమని ఈ లేఖలో వేడుకున్నది గీతిక, తానేమీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదని, కానీ ఆత్మహత్య చేసుకునేలా చేశారని రాసింది. గీతిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమెను వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుసగా మెడికోలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. గీతిక ఆత్మహత్య గురించిన వివరాలను నిన్న కళాశాల అధికారులతో మాట్లాడి తెలుసుకున్న కలెక్టర్ ప్రద్యుమ్న, పూర్తి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు