//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైద్య ఉద్యోగుల బదిలీలు షురూ

Category : state

వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు డ్రైవర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఎల్డీ కంప్యూటర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, నాలుగో తరగతి సిబ్బంది బదిలీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రాష్ట్ర పరిశీలకులుగా హాజరైన జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విక్రమ్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్‌ హరీష్‌రాజ్‌, డాక్టర్‌ వెంకటరమణ, డాక్టర్‌ శ్రీరాం, డాక్టర్‌ అన్నప్రసన్న, డాక్టర్‌ అప్పయ్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని క్యాడర్లలో 40 శాతానికి తగ్గకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించి పలువురిని బదిలీలు చేశారు.

స్పౌజ్‌, వితంతువులు, మెడికల్‌ గ్రౌండ్స్‌, గుర్తింపుపొందిన ఉద్యోగ సంఘాల బాధ్యులకు వారి సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు నిర్వహించారు. అయితే మొదట అనుకున్నట్లు ఫార్మసిస్టుల బదిలీల విషయంలో డీఎంఈ క్యాడర్‌లో ఉన్నవారిని జిల్లాస్థాయి క్యాడర్‌ బదిలీలలో చూపడంపై వచ్చిన అభ్యంతరాలతో నిలిపివేసి ఈనెల 15వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఎంపీహెచ్‌ఏ (స్త్రీ), ఏఎన్‌ఎంలకు గురువారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీష్‌రాజ్‌ చెప్పారు. కౌన్సిలింగ్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏవో సుశీల, మహబూబాబాద్‌ జిల్లా కార్యాలయం సూపరింటెండెంట్‌ సదానందం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.