//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుజరాత్‌లో మేథాపాట్కర్‌ అరెస్టు

Category : national politics

ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్‌ను గుజరాత్‌ పోలీసులు  అరెస్టు చేశారు. గుజరాత్‌లోని ఛోటా ఉదేపూర్‌ జిల్లాలో మేథాపాట్కర్‌తో పాటు మరో 150 మందిని పోలీసులు బుధవారం నిర్బంధంలోకి తీసుకున్నారు. నర్మదా డామ్‌ ప్రభావిత ప్రజలు చేస్తున్న ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

నర్మదా జిల్లాలోని కెవడియాలో డామ్‌ ప్రభావిత ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. గుజరాత్‌-మధ్యప్రదేశ్‌ సరిహద్దు సమీపంలో కవాంత్‌ పట్టణం వద్ద మేథాపాట్కర్‌తో పాటు ఇతరులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన  వారిలో ఈ సంవత్సరం గోల్డ్మన్ పర్యావరణ ప్రైజ్ పొందిన ప్రఫుల్ల సమాంతర, ప్రముఖ పర్యావరణ వేత్త సౌమ్య దుత్త, కిసాన్  సంఘర్ష సమితి కి చెందిన  డా. సునీలం, అఖిల భారతీయ కిసాన్ సభకు చెందిన   జసవిందర్ సింగ్ ప్రభతులు ఉన్నారు. 

నర్మదా లోయకు చెందిన ప్రజలు మహారాష్ట్ర లోని జీవంశాల వద్ద జరుగుతున్న బహిరంగ సభకు వెడుతుండగా గుజరాత్ సరిహద్దు దాటుకున్న సమయంలో ఈ అరెస్ట్ లు జరిపారు. వారిని అడ్డుకొని, ఎటువంటి ఉత్తరువులు చూపకుండా, శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఈ అరెస్ట్ లు జరిపారని నర్మదా బచావ్ ఆందోళన ఆరోపించింది. పైగా పోలీస్ లు అరెస్ట్ చేసిన మహిళా ప్రదర్శకులను దౌర్జన్యంగా లాగి వేశారని, ఒక మహిళా ప్రదర్శకురాలి కాలిపై నుండి పోలీస్ వ్యాన్ వెళ్లడంతో ఆమె గాయపడ్డారని కూడా తెలిపారు. 

పైగా, మేధా పాట్కర్ ను ఇతర ప్రదర్శకుల నుండి వేరుచేసి ఆమెను  తీసుకు వెళ్లి పోయారు. అందరిని సాయంత్రం   అలిరాజిపూర్ జిల్లాల్లో నాన్పుర్ పోలీస్ స్టేషన్ వద్ద వదిలివేశారు. తనకు అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా అడ్డుకోవడం ద్వారా  గుజరాత్ పోలీస్ లు నేరమయ చర్యకు పాల్పడ్డరని అంటూ ఆ పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు.