//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యోగి పాలనపై మాయావతి బ్లాస్టింగ్ కామెంట్స్

Category : national

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా మండిపడ్డారు. ఆలయాల్లో పూజల తర్వాత సమయం ఉంటే రాష్ట్ర అభివృద్ధి గురించి చూస్తారని ఎద్దేవా చేశారు. వెనుకబడిన పూర్వాంచల్ నుంచి వచ్చిన నేత అయినప్పటికీ, ఆ ప్రాంత అభివృద్ధిని ఆయన పట్టించుకోవడం లేదన్నారు. గోరఖ్‌నాథ్ ఆలయంలో కొంతకాలం, అయోధ్యలో మరికొంత కాలం, చిత్రకూట్‌లో ఇంకోసారి కనిపిస్తున్నారని, పూర్వాంచల్‌ను గాలికొదిలేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందబోదని స్పష్టం చేశారు.బీజేపీ నేతలు తమ పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు అయోధ్య, మధుర, వారణాసి దేవాలయాలకు వెళ్ళవచ్చునని, అయితే వారి మతం కార్డు ప్రజలను తప్పుదోవ పట్టించబోదని చెప్పారు.బీజేపీ పాలనలో నవ భారతం సాధ్యం కాదన్నారు. గతంలోని సమాజ్‌వాదీ పార్టీ పాలన అంత మంచిదేమీ కాదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మరింత దారుణమని చెప్పారు.