//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నీట్ కు ధీటుగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

Category : national

2017 విద్యాసంవత్సరానికి వైద్య, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. 2016వ సంవత్సరంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురైనా, పూర్తి స్థాయిలో ధీటుగా నీట్-2017 ప్రవేశ పరీక్ష రాయబోతున్నారు. దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో 'నీట్' పట్ల అవగాహన పెరిగింది. గత సంవత్సరం దాదాపు 7.31 లక్షల మంది నీట్ పరీక్షకు హాజరైతే, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 11,30,104 మంది పరీక్షా రాయబోతున్నారు. గత ఏడాది కన్నా ఈ సంఖ్య ఇంచుమించు 41 శాతం అధికం.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణం మాత్రమే పరీక్షా కేంద్రాలు కాగా ఈ మధ్యనే గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కర్నూలులలో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసారు. ప్రభుత్వ, ప్రవేట్ వైద్య కళాశాలల్లో సీట్లు నీట్-2017 ర్యాంక్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయ ర్యాంకులతోపాటు రాష్ట్రస్థాయి ర్యాంకులు కూడా ప్రకటిస్తారు. ఈ సారి విద్యార్థుల కోరిక మేరకు ఇంగ్లీష్ తో పాటు ప్రాంతీయ భాష తెలుగులో కూడా ప్రశ్నా పత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్యం కోట కింద ఇప్పటివరకు భర్తీ చేస్తున్న సీట్లను ప్రభుత్వమే భర్తీ చేసే ఆలోచన ఉంది. అదే జరిగితే భారీ డొనేషన్లు కట్టి కళాశాలల్లో చేరే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలున్న నీట్ ప్రవేశ పరీక్షకు ప్రణాళికా బద్దంగా సిద్ధమైతే మంచి ర్యాంకు తెచ్చుకోవటం సాధ్యమవుతుందని విశ్లేషకులు చెపుతున్నారు.      

Related News