//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడ అమ్మాయిలు తాగుడులో అబ్బాయిలను మించారు

Category : national

ఆకాశంలో స‌గం, అవ‌కాశాల్లో స‌గం, పురుషుల‌తో స‌మానంగా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు. వీటిలో చాలా వ‌ర‌కూ మ‌హిళ‌ల పాత్ర పెరిగింది కూడా. కేవ‌లం ఆఫీసుల‌కే ప‌రిమితం కాకుండా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ స‌హా కీల‌క రంగాల్లోనూ స్త్రీలు రాణిస్తున్నారు. మ‌గవారికి ఏమాత్రం తీసిపోబోమ‌ని చాటి చెబుతున్నారు. అయితే క‌ర్ణాట‌క రాజ‌ధాని, ఐటీ న‌గ‌రి బెంగ‌ళూరులో అమ్మాయిలు మ‌రో విష‌యంలోనూ మ‌గాళ్ల‌కి పోటీ వ‌స్తున్నార‌ట‌.

దేశంలో మొట్ట‌మొద‌ట‌గా ఐటీ ప‌రిశ్ర‌మ అభివ‌ృద్ధి చెంది కీల‌క సంస్థ‌ల‌న్నీ కొలువుదీరిన న‌గ‌రంగా బెంగ‌ళూరు గుర్తింపు పొందింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన అభ్య‌ర్థులు ఉద్యోగావ‌కాశాలు వెతుక్కుంటూ గార్డెన్‌సిటీలో వాలిపోయేవారు. ఫ‌లితంగా కొన్నేళ్లుగా ఇక్క‌డ పాశ్చాత్య సంస్క‌ృతి వేళ్లూనుకుంటోంది. ఈ క్ర‌మంలోనే మహానగరంలో మద్యం తాగి, వాహనాలు నడిపే యువతుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోతున్న వారిలో 38 శాతం మంది మహిళలే ఉన్నారట. వీరిలో ఎక్కువ మంది కన్నడేతరులే కావ‌డం విశేషం.

మద్యం తాగి వాహనాలు నడపటం నేరం. తమ నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు పోలీసుల‌గొడవ పడటం, దాన్ని తమ స్నేహితురాళ్లతో కలిసి సెల్‌ఫోన్ల‌లో రికార్డు చేసుకుని.. పోలీసులు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నార‌నే విష‌యం వెలుగులోకి వచ్చింది. ఎం.జి.రోడ్డు, కబ్బన్‌పార్కు, రెసిడెన్సీ రోడ్డు, యుబి సిటీ, ఎలక్ట్రానిక్‌ సిటీ, కోరమంగల, హెబ్బాళ ప్రాంతాల్లో.. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో నిర్వహిస్తున్న త‌నిఖీల్లో దొరికిపోతున్న యువతులను చూసి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.