భారత్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఢిల్లీకి వచ్చిన మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ శనివారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో వారు భేటీ అయి ఐదు వందల మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో కూడిన సముద్ర భద్రతా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ప్రధాని మోడీ వెల్లడించారు.ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చించారు. ముందుగా మారిషస్ ప్రధాని జగన్నాథ్ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో భేటీ అయ్యారు.