//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఊర్లో అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే శిక్ష

Category : national

ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో గల ఓ గ్రామం వినూత్న నిబంధనలు తీసుకొచ్చింది. ఆవులను చంపినా, మద్యం అమ్మకాలు చేపట్టినా, మహిళలు వీధుల్లో ఫోన్‌ వాడినా భారీ జరిమానాలు విధించేలా మడోరా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ బుధవారం సంబంధిత ఆదేశాలు జారీచేసింది.

అమ్మాయిలు వీధుల్లో నడుస్తూ ఫోన్‌ మాట్లాడినట్లు కన్పిస్తే వారికి రూ. 21వేల జరిమానా విధించనున్నారు. మహిళలపై నేరాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక, గోవధకు పాల్పడినా.. ఆవులను దొంగతనం చేసినా రూ. 2లక్షల వరకు జరిమానా వేయనున్నారు. దీంతో పాటు మద్యం అమ్మకాలు చేపడితే.. రూ. 1.11లక్షల వరకు అపరాధ రుసుము కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. జరిమానాలతో పాటు అవసరమైతే శిక్షలు కూడా విధిస్తారట. శిక్ష ఏంటనేది పంచాయతీనే నిర్ణయం తీసుకుంటుంది.