//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్బ‌రుద్దీన్ హ‌త్య‌కు భారీ కుట్ర‌..!

Category : politics

త‌న‌ను చంపేందుకు హైద‌రాబాద్‌లో ముఠా దిగింద‌ని మ‌జ్లీస్ ఫ్లోర్ లీడ‌ర్ అక్బ‌రుద్దీన్ ఓవైసీ అనుమానం వ్య‌క్తం చేశారు. పాత‌బ‌స్తీలోని యాక‌త్‌పురాలో ప‌ర్య‌టించిన ఆయ‌న త‌న‌ను చంపేందుకు 11 మంది వ‌చ్చార‌న్నారు. వారంతా బెనార‌స్, అహ్మాదాబాద్, క‌ర్ణాట‌క నుంచి వ‌చ్చిన్ట‌టు చెప్పారు. అయితే, అక్బ‌రుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.Master Plan to end Akbaruddin

త‌న‌ను చంపుతామ‌ని బెదిరింపు ఫోన్‌లు, లేఖ‌లు వ‌స్తున్నాయ‌ని అక్బ‌రుద్దీన్ అన్నారు. దాడి చేసేందుకు భారీగా కుట్ర జ‌రుగుతుంద‌ని గ‌తంలో కూడా త‌న‌ను చంప‌డానికి కొంద‌రు దుండ‌గులు బెంగ‌ళూరు నుంచి వ‌చ్చార‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ఒక‌రు ప‌ట్టుబ‌డి అక్బ‌రుద్దీన్‌ను చంపేందుకు వ‌చ్చిన‌ట్టు చెప్పార‌ని గుర్తు చేశారు. ఎవ‌రు ఎన్ని దాడుల‌కు పాల్ప‌డినా భ‌య‌ప‌డేది లేద‌ని స్పష్టం చేశారు. Master Plan to end Akbaruddin

ప్ర‌జ‌ల కోసం చ‌నిపోయేందుకు తాను ఎప్పుడూ సిద్ధ‌మేన‌ని చెప్పారు అక్బ‌రుద్దీన్‌. ఒక‌వేళ త‌న‌ను హ‌త్య చేసినా హైద‌రాబాద్ గ‌డ్డ‌పై వంద‌లాది అక్బ‌రుద్దీన్‌లు పుట్టుకొస్తార‌న్నారు. భారీ సెక్యూరిటీ మ‌ధ్య గ‌డిపే జీవితం త‌న‌కు వ‌ద్ద‌ని, సాధార‌ణ జీవిత‌మే ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చారు అక్బ‌రుద్దీన్‌. అయితే బెదిరింపు ఫోన్లు, లేఖ‌ల‌పై అక్బ‌రుద్దీన్ కానీ, ఎంఐఎం నేత‌లు కానీ పోలీసుల‌కు ఎటువంటి ఫిర్యాదు అంద‌లేదు.Master Plan to end Akbaruddin