Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహబూబ్ నగర్ హైవేపై భారీ అగ్నిప్రమాదం

Category : state

మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్.హెచ్ 44పై భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సరుకులతో వెళ్తున్న ఓ ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

భారీగా మంటలు ఎగిసి పడడంతో వెంటనే అప్రమత్తమైన ట్రక్కు డ్రైవర్ అందులోంచి బయటకు దూకాడు. మంటలు క్షణాల్లో ట్రక్కు మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. హైవేపై ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.

జాతీయ రహదారిపై వాహనాల రాకపోకకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు.

ఈ ఘటనలో పాణనష్టం తప్పినా ట్రక్కులో ఉన్న సరుకంతా కాలిపోవడంతో భారీ ఆస్తినష్టం జరిగింది. ట్రక్కు కూడా పూర్తిగా దగ్ధమైంది.