బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు, టీ20 & వన్డే కెప్టెన్ మష్రఫె మొర్తజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీసే తనకు ఆఖరని అతను పేర్కొన్నాడు. లంకతో తొలి టీ20 సందర్భంగా అతను రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంతవరకు తనకు సహకారం అందించిన నా కుటుంబ సభ్యులకు, తోటి ఆటగాళ్లకు మరియు కోచింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. బంగ్లాదేశ్‌కు గత పదేళ్లుగా టీ20ల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. బంగ్లాదేశ్ అన్ని రకాల ఫార్మాట్ లో బాగా రాణిస్తుందని, ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని మొర్తజా చెప్పాడు. బంగ్లా ఆడిన ఎక్కువ టీ20 మ్యాచ్‌లకు మొర్తజా కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొర్తజా సారథ్యంలో 26 T20 లు ఆడిన బంగ్లా 9 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మొత్తం 52 టీ20లు ఆడిన అతను 39 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో మొర్తజా కెప్టెన్‌గా కొనసాగుతాడు.
ODI డెబ్యూ (cap 53): 23 నవంబర్ 2001 v జింబాబ్వే
Test డెబ్యూ (cap 19): 8 నవంబర్ 2001 v జింబాబ్వే
T20I డెబ్యూ (cap 4): 28 నవంబర్ 2006 v జింబాబ్వే