పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రానికి లా కమిషన్ గట్టిగా సిఫార్సు చేసింది. దీనివల్ల వైవాహిక అక్రమాలను అడ్డుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. పెళ్లికి సంబంధించిన రికార్డులు లేని కారణంగా భార్య హోదా దక్కకుండా చేయడం నుంచి కూడా మహిళలకు రక్షణ కల్పించేందుకు వీలవుతుందని అభిప్రాయపడింది.
పెళ్లిళ్లను తప్పనిసరిగా నమోదు చేయని కారణంగా పలువురు పెళ్లిళ్లు చేసుకుని మహిళలను మోసం చేస్తున్నారని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో లా కమీషన్ స్పష్టం చేసింది. దీనివల్ల మహిళలకు సామాజిక గుర్తింపు కానీ, చట్టపరమైన భద్రత కానీ లేకుండా పోతోందని లా కమిషన్ పేర్కొంది.
ఇలాంటి వివాహాలు ముఖ్యంగా ప్రవాస భారతీయుల విషయంలో తరచూ చోటు చేసుకుంటున్నాయని, తప్పనిసరిగా రిజిస్టర్ చేయడం వల్ల అందరి ఆమోదంతో జరిగే పెళ్లిళ్లలో పాటించే షరతులను పాటించేలా చేయవచ్చని నివేదిక పేర్కొంది. వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ 1969నాటి జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టంలో ఓ చిన్నపాటి సవరణను చేరిస్తే సరిపోతుందని, వివాహాల చట్టాలను సవరించాల్సిన అవసరం లేదని కూడా లా కమిషన్ ఆ నివేదికలో అభిప్రాయపడింది.
మహిళలకు భార్య హోదా, అలాంటి వివాహ బంధంవల్ల పుట్టే పిల్లలకు చట్టబద్ధమైన హక్కులు లేకుండా చేయడాన్ని నిరోధించడానికి వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని న్యాయస్థానాలు పదే పదే నొక్కి చెప్పిన విషయాన్ని కమిషన్ తన నివేదికలో గుర్తు చేసింది.
2012లో దీనికి సంబంధించి ఒక సవరణ బిల్లును 2013లో రాజ్యసభ ఆమోదించింది. కానీ 2014లో 15వ లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లుకు కాలం చెల్లిపోయింది. దేశ జనాభా, భిన్న మతాలు, సంప్రదాయాల దృష్ట్యా ప్రతి పెళ్లిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయడం కష్టమనే ప్రచారం చేస్తున్నారని, అయితే ఇది ఎంత కష్టమైనప్పటికీ దీనివల్ల కలిగే ప్రయోజనాలను తోసిరాజనలేమని కమిషన్ అభిప్రాయపడింది. ఒకసారి ఇది చట్టంగా మారితే చాలా సివిల్, క్రిమినల్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలవుతుందని కూడా కమిషన్ అభిప్రాయపడింది.
పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి
Category : editorial

Related News
-
అధిక బరువు తగ్గటం లేదా ? అయితే అవిసెలను ట్రై చెయ్యండి
-
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు ఎందుకో తెలుసా ?
-
౩ నెలలపాటు కోరమీసాల కొమురెల్లి మల్లన్న జాతర చూసొద్దాం రండి
-
అద్భుత ద్వీపం బాలి వెళ్తే జాలీనే
-
గృహిణుల శ్రమ విలువ తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం
-
అరకులో హాట్ బెలూన్ ఫెస్టివల్.. విహంగ వీక్షణంతో పర్యాటకుల సంబరం
-
పిల్లలని కనటం అంటే.. 11 ఏళ్ళ తల్లి ఆయుష్షు తగ్గించుకోటమే...
-
అర్థంకాని ,మందుల చీటీ ...డాక్టర్లకు జరీమానా వాత
-
సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
వినాయక చవితి రోజు గుడిలో వీటిని సమర్పిస్తే ....మీకు ఇక తిరుగుండదు ...!
-
పోలీస్ అనే వాళ్లందరికీ ఆయనే స్ఫూర్తి..