//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భద్రాచలంలో గంజాయి రవాణా చేస్తున్న వ్యాన్ పట్టివేత .. 6 క్వింటాళ్ళ గంజాయి సీజ్

Category : state

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.ఇటీవల విశాఖ జిల్లాలో అంబులెన్స్ లో తరలిస్తూ భారీగా గంజాయి పట్టుపడగా, మొన్నటికి మొన్న బొగ్గు లారీ లో తరలిస్తున్న గంజాయిని సిద్దిపేటలో పట్టుకోగా, ఇక ఇప్పుడు వ్యాన్ లో తరలిస్తున్న గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ఇలా వరుస ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా ఎంతగా జరుగుతుందో తేటతెల్లం చేస్తున్నాయి.

తాజాగా ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా పరిసరాలలో సేకరించిన గంజాయిని హైదరాబాద్‌ తరలిస్తుండగా భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. గోదావరి బ్రిడ్జి సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద అటవీ, పోలీసు, ఎక్సైజ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున ఓ డీసీఎం వ్యానులో భారీగా గంజాయి పట్టుబడింది.

వ్యాన్‌లో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసులు గంజాయిని గుర్తించగానే నిందితులు వ్యాన్‌ను వదిలిపారిపోయారు. పోలీసులు గంజాయి ప్యాకెట్లను భద్రాచలం ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 6 క్వింటాళ్ల గంజాయి ధర మార్కెట్లో రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో గంజాయి దందాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Related News